Prakash Raj: జాతీయ అవార్డులపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Prakash Raj Comments on National Film Awards Controversy
  • జాతీయ అవార్డులు రాజీ పడుతున్నాయన్న ప్రకాశ్ రాజ్
  • కొందరికే అవార్డులు వెళుతున్నాయని ఆరోపణ
  • మమ్ముట్టి లాంటి గొప్ప నటులకు అవార్డులు అవసరం లేదని వ్యాఖ్య
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రక్రియపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అవార్డులు రాజీ పడుతున్నాయని, కొందరికి మాత్రమే దక్కుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇటీవల కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేరళ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. "వారు నన్ను పిలిచినప్పుడు, ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని, అనుభవజ్ఞుడైన బయటి వ్యక్తిగా పూర్తి నిర్ణయాధికారం మీకే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. కానీ జాతీయ అవార్డుల విషయంలో అలా జరగడం లేదు. అది మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం" అని ఆయన అన్నారు.

ప్రస్తుత జాతీయ అవార్డుల విధానాన్ని విమర్శిస్తూ, "కొందరికే అవార్డులు వెళ్తున్నాయి. 'మంజుమ్మెల్ బాయ్స్', 'భ్రమయుగం' వంటి గొప్ప చిత్రాలకు పురస్కారాలు దక్కడం లేదు. ఇలాంటి జ్యూరీ, ఇలాంటి ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు.. మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు" అని ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమకు ఒక విజ్ఞప్తి చేశారు. దర్శకులు, రచయితలు కేవలం పెద్దలు, యువతను మాత్రమే కాకుండా పిల్లలను కూడా సమాజంలో భాగంగా గుర్తించాలని సూచించారు. పిల్లల కోసం మరిన్ని మంచి చిత్రాలు తీయడం గురించి ఆలోచించాలని కోరారు.
Prakash Raj
National Film Awards
Kerala State Film Awards
Manjummel Boys
Bramayugam
Mammootty
film awards controversy
Indian Cinema
movie awards
film jury

More Telugu News