Babu Bhai Jirawala: ఈ వ్యాపారవేత్త ఎంత మంచివాడో!
- తల్లి వర్ధంతి సందర్భంగా సూరత్ వ్యాపారి వినూత్న సాయం
- గుజరాత్‌లోని 290 మంది రైతులకు రుణ విముక్తి
- 30 ఏళ్లుగా వేధిస్తున్న మోసపూరిత రుణాల సమస్యకు పరిష్కారం
- రూ.90 లక్షలు ఏకమొత్తంగా చెల్లించిన బాబూ భాయ్ జిరావాలా
- అన్నదాతలకు వారి భూమి పత్రాల అందజేత
తల్లి వర్ధంతిని పురస్కరించుకుని కొందరు అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తుంటారు. కానీ సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వినూత్నంగా ఆలోచించి, 290 రైతు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. మూడు దశాబ్దాలుగా వారిని వేధిస్తున్న ఓ మోసపూరిత రుణ భారాన్ని పూర్తిగా తొలగించి, వారిని రుణ విముక్తులను చేశారు.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లా, జీరా గ్రామానికి చెందిన 290 మంది రైతులు సుమారు 30 ఏళ్లుగా ఓ తీవ్ర సమస్యతో సతమతమవుతున్నారు. 1995లో స్థానిక జీరా సేవా సహకార మండలిలో గుర్తు తెలియని వ్యక్తులు వారి పేరు మీద రుణాలు తీసుకున్నారు. ఈ మోసం వెనుక సొసైటీ సభ్యులే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, రుజువు చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఉండిపోయారు. అప్పటి నుంచి వారి భూమి పత్రాలు సహకార సంఘం వద్దే ఉండిపోయాయి. దీంతో వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణాలు గానీ, ఇతర ఆర్థిక సాయం గానీ అందని దుస్థితి నెలకొంది. కుటుంబాల్లో ఆస్తి పంపకాలు కూడా నిలిచిపోయాయి. ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.
ఆపద్బాంధవుడిలా ఆదుకొని..
ఈ విషయం సూరత్‌కు చెందిన పారిశ్రామికవేత్త బాబూ భాయ్ జిరావాలా, ఆయన సోదరుడు ఘనశ్యామ్ భాయ్ దృష్టికి వచ్చింది. తమ తల్లి వర్ధంతి రోజున ఆ రైతులను రుణ విముక్తులను చేయాలని వారు సంకల్పించారు. వెంటనే రంగంలోకి దిగి, రైతుల పేరు మీద ఉన్న మొత్తం రూ.90 లక్షల రుణాన్ని ఏకమొత్తంగా బ్యాంకులో డిపాజిట్ చేశారు. అనంతరం, రుణ విముక్తికి సంబంధించిన పత్రాలను, భూమి డాక్యుమెంట్లను రైతులకు అందజేశారు.
ఏళ్ల తరబడి తమను వేధిస్తున్న సమస్య తీరిపోవడంతో పాటు, భూమి పత్రాలు చేతికి అందడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొందరు ఆనంద బాష్పాలు రాల్చగా, మరికొందరు ఆ వ్యాపారవేత్తను, ఆయన కుటుంబాన్ని మనసారా దీవించారు. ఇంత పెద్ద సాయం చేసినా, బాబూ భాయ్ ఎక్కడా తన తల్లి పేరును కూడా ప్రస్తావించకపోవడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఇలాంటి మంచి పనులు చేయాలనే స్ఫూర్తి తన తల్లి నుంచే వచ్చిందని ఆయన వినమ్రంగా తెలిపారు. తమ కుటుంబానికి రైతుల ఆశీస్సులు ఉంటే చాలని ఆయన పేర్కొన్నారు.