Visakhapatnam: విశాఖలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడిన నగరవాసులు

Visakhapatnam Earthquake tremors felt in Vizag
  • గాజువాక, మధురవాడ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
  • కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి
  • నిద్రలో ఉలిక్కిపడి బయటకు పరుగులు తీసిన ప్రజలు
విశాఖపట్నం నగరంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నగర ప్రజలు గాఢ నిద్రలో ఉండగా, భూమి కొన్ని సెకన్లపాటు కంపించడంతో భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

వివరాల్లోకి వెళితే, ఈరోజు తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 గంటల మధ్య ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు.

అకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో నిద్ర నుంచి ఉలిక్కిపడిన నగరవాసులు ఏం జరుగుతోందో తెలియక ఆందోళన చెందారు. భయంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై గుమికూడారు. కొంతసేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి కూడా జంకారు. అయితే, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైందనే వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. 
Visakhapatnam
Visakhapatnam earthquake
Vizag earthquake
Andhra Pradesh earthquake
Earth tremors
Gajuwaka
Madhurawada
Bheemili
Earthquake today
Seismic activity

More Telugu News