Manoj Kumar: నకిలీ మద్యం కేసులో మరో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..నిచారణలో బిగ్ ట్విస్ట్

Manoj Kumar arrested in fake liquor case investigation twist
  • నకిలీ మద్యం కేసులో ఏ20 నిందితుడు మనోజ్‌కుమార్‌
  • విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ
  • విచారణ సమయంలో అస్వస్థతకు గురైన నిందితుడు
  • ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించిన అధికారులు
  • ప్రధాన నిందితుడికి బాటిల్ మూతలు సరఫరా చేసినట్లు ఆరోపణ
నకిలీ మద్యం కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్న మనోజ్‌కుమార్‌ను ఎక్సైజ్ అధికారులు విచారిస్తుండగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ జరుగుతుండగా మనోజ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
 
నకిలీ మద్యం తయారీ కేసులో మనోజ్‌కుమార్ ఏ 20 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జనార్దనరావుకు (ఏ1) నకిలీ మద్యం బాటిళ్లకు అవసరమైన మూతలను మనోజ్ సరఫరా చేసినట్లు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ మధ్యలో ఆయన అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
 
ఆస్పత్రిలో చికిత్స అనంతరం మనోజ్ కోలుకోవడంతో, అధికారులు అతనికి సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసి పంపించారు. మనోజ్‌పై గతంలోనూ నర్సాపురం, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.
Manoj Kumar
Fake liquor case
Vijayawada
Excise Department
Janardhana Rao
Counterfeit alcohol
Andhra Pradesh
Narsapuram
Telangana

More Telugu News