రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మహిళల వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
- ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్ పోరు
- భారత్, దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ కోసం కీలక మ్యాచ్
- నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఫైనల్
- ఎట్టకేలకు కరుణించిన వరుణుడు
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- తొలుత బ్యాటింగ్ చేయనున్న హర్మన్‌ప్రీత్ సేన
ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో ఇరు జట్లు పటిష్టమైన వ్యూహాలతో బరిలోకి దిగాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని దక్షిణాఫ్రికా జట్టు ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆడుతున్న జట్ల వివరాలు
భారత మహిళల జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
దక్షిణాఫ్రికా మహిళల జట్టు: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బోష్, సునే లూస్, మరిజానే కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), అన్నెరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నడిన్ డి క్లర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులెలెకో మ్లాబా.