మణుగూరులో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశించిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టారు. అంతేకాకుండా, కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను చించివేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రభుత్వానికి చెందిన స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని కాంగ్రెస్ నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.