Nitish Kumar: ఈసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టలేనని నితీశ్ కుమార్‌కు తెలుసు: కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

Nitish Kumar aware he cannot be CM this time says Congress leader
  • అందుకే ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వడం లేదన్న అశోక్ గెహ్లాట్
  • ఎన్నికల తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరో తెలుస్తుందని వ్యాఖ్య
  • మేనిఫెస్టో విడుదల సమయంలో నితీశ్ కుమార్‌ను బీజేపీ అవమానించిందని విమర్శ
ఈసారి బీహార్ ముఖ్యమంత్రి పదవిని తాను చేపట్టలేనని నితీశ్ కుమార్‌కు తెలుసని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. నితీశ్ కుమార్‌కు ఆ విషయం తెలుసు కాబట్టే ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని అన్నారు.

ఎన్నికల తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలుస్తుందని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో విడుదల సమయంలో బీజేపీ నితీశ్ కుమార్‌ను అవమానించిందని గెహ్లాట్ అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఈసారి మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించినా నితీశ్ కుమార్‌ను మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనివ్వరని అంతకుముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. బీజేపీలోని గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు హైజాక్ చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. బీహార్‌ను వారిద్దరే నియంత్రిస్తున్నారని ఆరోపించారు.
Nitish Kumar
Bihar
Ashok Gehlot
Bihar Elections 2024
Mahagathbandhan
Tejashwi Yadav
NDA
Congress
RJD
Chief Minister

More Telugu News