Ilayaraja: కుమార్తె పేరు మీద 'గాళ్స్ ఆర్కెస్ట్రా' ఏర్పాటు చేస్తున్న ఇళయరాజా

Ilayaraja to Launch All Girls Orchestra in Daughter Bhavatharinis Memory
  • గతేడాది క్యాన్సర్ తో కన్నుమూసిన ఇళయరాజా కుమార్తె భవతారిణి
  • తాజాగా భవతా గాళ్స్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేస్తున్న ఇళయరాజా
  • ఔత్సాహికులు ఈ అవకాశం వదులుకోవద్దంటూ ప్రకటన
లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె భవతారిణి గతేడాది జనవరిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 47 ఏళ్ల భవతారిణి క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, కుమార్తె పేరు మీద ఇళయరాజా ఆల్ గాళ్స్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ఈ మ్యూజిక్ బ్యాండ్ లో అందరూ అమ్మాయిలే ఉంటారు. ఈ విషయాన్ని ఇళయరాజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

"భవతా గాళ్స్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేస్తుండడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. స్వరాలు, వాయిద్యాల సమ్మేళనంతో నా బిడ్డ భవతారిణికి నీరాజనాలు అర్పిస్తాను. మీరు ఔత్సాహిక గాయని లేక ఔత్సాహిక సంగీతకారిణి అయితే ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. మీ ప్రతిభతో మీరు ప్రకాశించేందుకు ఇది వేదికగా నిలుస్తుంది. మీ గానం, సంగీత వాయిద్య ప్రతిభకు సంబంధించిన శాంపిల్స్ ను [email protected] మెయిడ్ ఐడీకి పంపించండి. మీ ప్రొఫైల్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పంపించండి... త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాం" అంటూ ఇళయరాజా తన ప్రకటనలో పేర్కొన్నారు. 
Ilayaraja
Bhavatharini
all girls orchestra
music composer
Indian music
Tamil music
Tollywood music
music auditions
Bhavatha Girls Orchestra

More Telugu News