Revanth Reddy: రేవంత్ రెడ్డితో కెనడా హైకమిషనర్, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బృందాలు భేటీ

Revanth Reddy Meets Canada High Commissioner France Consul General
  • ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ అంశాలపై క్రిస్టోఫర్ కూటర్ బృందంతో చర్చ
  • తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కెనడా హైకమిషనర్‌ను కోరిన సీఎం
  • భాగ్యనగరంలో అమలవుతున్న ఫ్రాన్స్ ప్రాజెక్టులను ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్‌కు వివరించిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించారు.

కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందంతో జరిగిన సమావేశంలో ఐటీ, ఫార్మా, ఏరో స్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో కెనడాతో భాగస్వామ్యంపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెనడా హైకమిషనర్‌కు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్‌లో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందంతో జరిగిన సమావేశంలో, భాగ్యనగరంలో అమలవుతున్న ఫ్రాన్స్ ప్రాజెక్టులపై చర్చించారు. నగరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. హైదరాబాద్‌లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy
Telangana
Canada High Commissioner
France Consul General
Investment
IT Sector

More Telugu News