Praveen Khandelwal: ఢిల్లీ పేరు మార్చండి: అమిత్ షా, రేఖా గుప్తాలకు బీజేపీ ఎంపీ లేఖ

Praveen Khandelwal writes to Amit Shah for Delhi name change
  • 'ఇంద్రప్రస్థ'గా మార్చాలని లేఖలో డిమాండ్ చేసిన ఎంపీ
  • దేశ రాజధానిలో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్
  • 'ఇంద్రప్రస్థ'గా మార్చడం ద్వారా భారతదేశ చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలుస్తుందన్న ఎంపీ
ఢిల్లీ పేరు మార్చాలని కోరుతూ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్‌వాలా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఢిల్లీ పేరు మార్చాలనే డిమాండ్లు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. ఈ నగరం పేరును 'ఇంద్రప్రస్థ'గా మార్చాలని విశ్వహిందూ పరిషత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. తాజాగా ఒక ఎంపీ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

ఢిల్లీ పేరును 'ఇంద్రప్రస్థ'గా మార్చడం ద్వారా అది చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబిస్తుందని ప్రవీణ్ ఖండేల్‌వాలా పేర్కొన్నారు. నగరంలోని పాత రైల్వే స్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయాల పేర్లను కూడా మార్చాలని బీజేపీ ఎంపీ ఆ లేఖలో కోరారు. దేశ రాజధానిలో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి వంటి నగరాల పేర్లు వాటి మూలాలకు అనుగుణంగా ఉన్నాయని, అలాంటప్పుడు దేశ రాజధాని పేరు కూడా అలా ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. నగరం పేరును 'ఇంద్రప్రస్థ'గా మార్చడం ద్వారా భారత దేశ చరిత్ర, సంస్కృతి, పాండవుల నీతి, ధర్మం భవిష్యత్తు తరాలకు తెలియజేసిన వారమవుతామని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పేరు మార్పునకు సంబంధించిన లేఖను అమిత్ షాతో పాటు ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కూడా పంపించానని ప్రవీణ్ ఖండేల్‌వాలా తెలిపారు.
Praveen Khandelwal
Delhi name change
Amit Shah
Indraprastha
Rekha Gupta
BJP MP
Delhi renaming

More Telugu News