Chandrababu Naidu: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Naidu Reacts to Kashibugga Temple Tragedy
  • శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన
  • 9 మంది దుర్మరణం
  • ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
  • భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని ఆవేదన
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన సీఎం
  • గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో పలువురు భక్తులు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన చెందారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అని అభివర్ణించారు.

ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి, మరణించిన భక్తుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయాలపాలైన వారికి వీలైనంత త్వరగా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను వెంటనే ఆదేశించారు.

స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని చంద్రబాబు కోరారు. బాధితులకు అండగా నిలవాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Chandrababu Naidu
Kashibugga
Srikakulam
Andhra Pradesh
Venkateswara Temple
Stampede
Temple Tragedy
Andhra Pradesh News
CM Chandrababu

More Telugu News