Vivek Oberoi: 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమాలో ఔరంగజేబు పాత్రలో వివేక్ ఒబెరాయ్!

Vivek Oberoi as Aurangzeb in The Pride of Bharat Chatrapathi Shivaji Maharaj
  • సందీప్ సింగ్ దర్శకత్వంలో శివాజీ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్న చిత్రం
  • జిజియామాతగా నటిస్తున్న షెఫాలీ షా
  • వివేక్ ఒబెరాయ్ పాత్రపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' చిత్రంలో ఔరంగజేబు పాత్రను పోషించనున్నారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ మహారాజు పాత్రను రిషబ్ శెట్టి పోషిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న పాత్ర గురించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ చిత్రంలో శివాజీ మహారాజు పాత్రలో రిషబ్ శెట్టి, జిజియామాతగా షెఫాలీ షా నటించనుండగా, ఔరంగజేబు పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ పేరు ఖరారైనట్లుగా సమాచారం. అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్', నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం' చిత్రాలలో కూడా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు.

సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రతిష్ఠాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. జాతీయ, అకాడమీ అవార్డులు గెలుచుకున్న సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ భారీ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగలీ, ఇంగ్లీష్ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Vivek Oberoi
Chatrapathi Shivaji Maharaj
The Pride of Bharat
Aurangzeb
Rishab Shetty
Sandeep Singh

More Telugu News