Rajnath Singh: అమెరికా-భారత్ మధ్య కీలక రక్షణ ఒప్పందం

Key defense agreement between US and India
  • ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం
  • పదేళ్ల పాటు ఉండే ఒప్పందంపై సంతకం చేసిన ఇరుదేశాలు
  • రాజ్‌నాథ్‌తో భేటీ కావడం సంతోషంగా ఉందన్న అమెరికా రక్షణ మంత్రి
అమెరికా, భారత దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. మలేషియాలో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌లు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత సహకారాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందం పదేళ్ల పాటు కొనసాగనుంది.

ఈ సందర్భంగా హెగ్సెత్ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, పదేళ్ల రక్షణ ఒప్పందంపై సంతకం చేయడానికి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళుతుందని ఆయన అన్నారు. సమన్వయం, సమాచారంతో పాటు సహకారాన్ని మరింతగా పెంచుకుంటామని, తమ రక్షణ సంబంధాలు మరింత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Rajnath Singh
US India defense deal
India US relations
Sheetz Hegseth
ASEAN Defence Ministers Meeting

More Telugu News