దర్శకుడు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇవ్వలేదు: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడి
- ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన నిర్మాణ సంస్థ
- దర్శకుడితో వ్యాపారపరమైన ఒప్పందాలు జరగలేదని వెల్లడి
- నిజానిజాలు తెలుసుకుని వార్తను ప్రచారం చేయాలని సూచన
ఈ ప్రచారంపై 'ఎక్స్' వేదికగా నిర్మాణ సంస్థ స్పందిస్తూ, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏ ప్రాజెక్టు కోసమూ అడ్వాన్స్ ఇవ్వలేదని, తమకు, దర్శకుడికి మధ్య వ్యాపారపరమైన ఒప్పందాలు జరగలేదని పేర్కొంది. ఏదైనా వార్తను ప్రచారం చేసే ముందు అందులోని నిజానిజాలు తెలుసుకోవాలని కోరుతున్నామని తెలిపింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.