Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ

Revanth Reddy meets Bollywood superstar Salman Khan
     
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం ముంబైలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తానని సల్మాన్ ఖాన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వీరిద్దరి మధ్య జరిగిన చర్చల పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ, తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచ స్థాయిలో ఇనుమడింపజేసే అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘#TelanganaRising’ (తెలంగాణ రైజింగ్) అనే సందేశాన్ని ప్రపంచ నలుమూలలకూ తీసుకెళ్తానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావడం ఇది రెండోసారి. గత జులై నెలలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ముఖ్యమంత్రిని కలిసి, రాష్ట్ర ప్రభుత్వ జ్యూరీ అవార్డు ప్రకటించినందుకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ద్వారా తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం, రాష్ట్ర ప్రతిష్ఠను పెంచడంలో భాగంగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Revanth Reddy
Salman Khan
Telangana
Telangana Rising
Bollywood
Mumbai
Investment
Brand Image
Dulquer Salmaan
Telangana Development

More Telugu News