Nara Rohit: ఘనంగా నారా రోహిత్ వివాహం.... హాజరైన చంద్రబాబు, లోకేశ్... ఫొటోలు ఇవిగో!

Nara Rohit Wedding Grand Celebration Attended by Chandrababu and Lokesh
  • నారా వారింట పెళ్లి సందడి
  • ఒక ఇంటివారైన నటుడు నారా రోహిత్, శిరీష
  • హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వివాహ వేడుక
  • దివంగత సోదరుడిని గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు
  • కుటుంబంతో కలిసి హాజరైన మంత్రి నారా లోకేశ్
  • నూతన దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు, లోకేశ్
నారా కుటుంబంలో వివాహ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుని కుమారుడు, నటుడు నారా రోహిత్, శిరీషల వివాహం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చంద్రబాబు, లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "మా ఇంటి పెళ్లి సందడి. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు" అని చంద్రబాబు పేర్కొన్నారు.

మరోవైపు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. "కుటుంబంతో కలిసి సోదరుడు నారా రోహిత్ వివాహ వేడుకకు హాజరయ్యాను. హైదరాబాద్ అజీజ్ నగర్‌లోని ద వెన్యూ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు నారా రోహిత్, శిరీషలను ఆశీర్వదించాను. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపాను," అని లోకేశ్ తన పోస్టులో వివరించారు. ఈ వివాహ వేడుకకు పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
Nara Rohit
Nara Chandrababu Naidu
Nara Lokesh
Sirisha
Nara Rohit marriage
Telugu actor
Hyderabad wedding
Andhra Pradesh politics
Family event
Celebrity wedding

More Telugu News