మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే...
- శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రమాణ స్వీకారం
- రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మంత్రి పదవి
తెలంగాణలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 15 మంది ఉన్నారు. మరో ముగ్గురికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కోదండరాంతో పాటు అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ, గవర్నర్ ఆమోదించవలసి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.