Naini Rajender Reddy: పెళ్లిళ్లలో వృథా అయ్యే భోజనాన్ని పంపించండి: వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్

Naini Rajender Reddy Appeals to Donate Wedding Food to Warangal Flood Victims
  • వరంగల్ నగరంలో నీట మునిగిన పలు ప్రాంతాలు
  • డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందజేత
  • పెళ్లిళ్లలో భోజనం వృథా చేయకుండా బాధితులకు పంపించాలని వీడియో విడుదల
మొంథా తుపాను ప్రభావంతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

వరంగల్ నగరంలో ఈ రోజు చాలా వివాహాలు జరుగుతున్నందున, మిగిలిపోయిన భోజనాన్ని వరదల్లో చిక్కుకున్న బాధితులకు అందజేయాలని ఆయన కోరారు. భోజనం సేకరించేందుకు తమ బృందం సిద్ధంగా ఉంటుందని, సమాచారం అందిస్తే ఆ భోజనాన్ని వృథా చేయకుండా బాధితులకు అందజేస్తామని తెలిపారు.

ఇదిలా ఉండగా, వరంగల్ నగరంలోని 470 మంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారు రాత్రి నుండి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. స్పందించిన రెస్క్యూ సిబ్బంది వారిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరంగల్‌లో ముంపు ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్య శారద పర్యటించారు.
Naini Rajender Reddy
Warangal
Warangal floods
Telangana floods
Konda Surekha
Kadyam Kavya

More Telugu News