Shoban Babu: శోభన్ బాబు గురించి మనవడు సురక్షిత్ చెప్పింది ఇదే!

Surakshith Interview
  • ఊళ్లోవారికి మామయ్య అంటే ఎంతో ఇష్టం
  • నన్ను కూడా ఎంతో అభిమానించేవారు 
  • ఆయనను తలచుకుంటే గర్వంగా ఉంటుంది 
  • అందరం కలిసిమెలిసే ఉంటామని చెప్పిన సురక్షిత్
        
జీవితంలో ప్రతి అవమానాన్ని ఒక అనుభవంగా .. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా మలచుకున్న కథానాయకుడిగా శోభన్ బాబు కనిపిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు అతలాకుతలం చేసిన కారణంగా, డబ్బు విషయంలో ఆయన జాగ్రత్తపడుతూ వచ్చారు. ఒక నటుడికి ఆరోగ్యంతో పాటు కెరియర్ .. ఫ్యామిలీ ఎంతో ముఖ్యమైనవని ఆయన భావించారు. ఆయన పాటించిన క్రమశిక్షణాయుతమైన జీవితమే ఆయనను శ్రీమంతుడిని చేసింది. అలాంటి శోభన్ బాబును గురించి ఆయన మనవడు సురక్షిత్, రీసెంట్ గా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

" మా తాతగారి సొంత ఊరు నేను వెళ్లాను. ఆయనంటే అక్కడివాళ్లకి ఎంత అభిమానమనేది నేను చూశాను. ఆయన మనవడిగా నాపై కూడా వాళ్లు ఎంతో అభిమానం చూపించేవారు. మేము ఆ ఊరుకి వచ్చామని తెలియగానే, ఊళ్లో వాళ్లంతా వచ్చేసేవారు. శోభన్ బాబు మనవడు ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి వాళ్లలో కనిపించేది. ఆ ఊరుతో నాకు అనుబంధం ఏర్పడిపోయింది. ఆయన ఆ గ్రామాన్ని వదిలేసి .. సినిమాలు మానేసి ..  చనిపోయి కూడా చాలా కాలమైంది. అయినా ఇప్పటికీ అందరూ ఆయన గురించి మాట్లాడుకోవడం నాకు గర్వంగా అనిపించింది" అని అన్నారు.

" మా తాతగారు సినిమాలు మానేసిన తరువాత, సంతోషంగా .. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేసేవారు. ఉదయాన్నే పేపర్ చూసేవారు .. టీవీలో న్యూస్ చూసేవారు. అలాగే ప్రతిరోజు యోగా చేసేవారు. ఆహార నియమాల విషయంలో ఆయన చాలా కఠినంగా ఉండేవారు. తన ముగ్గురు కూతుళ్ల దగ్గరికి కార్లో ఒక రౌండ్ వేసేవారు. మా మామయ్య కూడా వాళ్లందరినీ అంతే ప్రేమగా చూసుకుంటూ ఉంటారు" అని చెప్పారు. 

Shoban Babu
Surakshith
Telugu cinema
actor
Suman TV interview
family
village
health
yoga
lifestyle

More Telugu News