Paddy loss: డ్రైనేజీ పాలైన ధాన్యం.. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న మహిళా రైతు.. వీడియో ఇదిగో!
––
మొంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం తడిసిపోయింది. వరద నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో అమ్మకానికి తెచ్చిన ధాన్యం డ్రైనేజీ పాలైంది. వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. డ్రైనేజీలో నుంచి ధాన్యాన్ని ఎత్తిపోస్తూ ఓ మహిళా రైతు గుండెలు బాదుకోవడం చూపరుల కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట డ్రైనేజీ పాలైందని మహిళా రైతు ఆవేదన చెందుతూ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. మార్కెట్ ను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ కాళ్లు మొక్కుతూ న్యాయం చేయాలని వేడుకుంది.