Pradeep Ranganathan: 100 కోట్లు కొల్లగొట్టిన 'డ్యూడ్' .. ఓటీటీ తెరపైకి!

Dude Movie Update
  • తమిళంలో రూపొందిన 'డ్యూడ్'
  • పాతిక కోట్లతో జరిగిన నిర్మాణం 
  • 100 కోట్లకి పైగా వసూళ్లు 
  • నెట్ ఫ్లిక్స్ చేతికి ఓటీటీ హక్కులు 

ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందిన సినిమానే 'డ్యూడ్'. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన సినిమా ఇది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఇంతకుముందు ప్రదీప్ రంగనాథన్ చేసిన 'డ్రాగన్' సినిమా సూపర్ హిట్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకోగలిగింది. 25 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 

మమితా బైజు కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించారు. ముఖ్యమైన పాత్రలో హృదు హరూన్ కనిపించాడు. సాయి అభ్యాంకర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అన్ని యూత్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానున్నట్టుగా తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నారు. 

కథలోకి వెళితే .. గగన్ తన మేనమామ కూతురైన కుందనను లవ్ చేస్తాడు. అయితే తన తల్లికీ .. మేనమామకు మాటలు లేకపోవడం వలన, ఈ ప్రేమ విషయాన్ని బయటికి చెప్పడానికి భయపడుతూ ఉంటారు. కుందనపై తనకున్నది ప్రేమేనని గగన్ గ్రహించేలోగా, తన కూతురును మేనల్లుడికే ఇవ్వాలని మేనమామ నిర్ణయించుకునేలోగా ఆమె 'పార్థు'కి మనసిస్తుంది. పర్యవసానంగా ఏం జరుగుతుందనేది కథ. 

Pradeep Ranganathan
Dude Movie
Love Today Telugu
Mamitha Baiju
Netflix Telugu
Sarath Kumar
Telugu OTT Release
Youth Movie Telugu
Romantic Comedy Telugu
Telugu Cinema

More Telugu News