Himanshu Shukla: సంగం బ్యారేజీకి తప్పిన పెను ప్రమాదం

Himanshu Shukla Sangam Barrage Escapes Major Disaster in Nellore
  • పెన్నా నది వరద ఉద్ధృతికి కొట్టుకొచ్చిన మూడు ఇసుక లోడు పడవలు
  • రెండింటిని సురక్షిత ప్రాంతాలకు చేర్చిన అధికారులు
  • ఆనకట్ట సమీపంలో ఇరుక్కుపోయిన మరో పడవ
  • పరిస్థితిని పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం పెన్నా నది బ్యారేజీ వద్ద పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. వరద ఉద్ధృతికి తాళ్లు తెంచుకుని కొట్టుకు వచ్చిన మూడు ఇసుక పడవలు బ్యారేజీ వైపు దూసుకురావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారులు సకాలంలో స్పందించి వాటిని నియంత్రించడంతో పెను విధ్వంసం జరగకుండా నివారించారు.

వివరాల్లోకి వెళితే.. బీరాపేరు, బొగ్గేరు వాగుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పెన్నా నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో బుధవారం నాటికి సంగం బ్యారేజీ వద్ద నీటిమట్టం 11 అడుగులకు చేరుకుంది. వరద తాకిడికి వంతెన రెయిలింగ్‌కు కట్టి ఉంచిన ఇసుక పడవల తాళ్లు తెగిపోయాయి. నియంత్రణ కోల్పోయిన మూడు పడవలు వేగంగా బ్యారేజీ వైపు కొట్టుకురావడం మొదలుపెట్టాయి.

ఈ పరిణామాన్ని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. రెండు పడవలను విజయవంతంగా అదుపులోకి తెచ్చారు. వాటిలో ఒకదాన్ని ఇసుక రేవు వద్దకు, మరొకదాన్ని కనిగిరి జలాశయం ప్రధాన రెగ్యులేటర్ వద్దకు సురక్షితంగా చేర్చారు. అయితే, మూడో పడవ బ్యారేజీకి సుమారు 400 మీటర్ల ఎగువన పాత ఆనకట్ట క్రెస్ట్ వద్ద ఇరుక్కుపోయింది.

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సరైన సమయంలో యంత్రాంగం స్పందించకుంటే ఈ పడవలు బ్యారేజీ గేట్లను ఢీకొని ఉంటే భారీ నష్టం వాటిల్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 
Himanshu Shukla
Nellore
Sangam Barrage
Penna River
Andhra Pradesh floods
barrage accident
river flooding
Ajita Vejendla
flood control
river rescue

More Telugu News