Chandrababu Naidu: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన... రౌండప్ ఇదిగో!

Chandrababu Naidu Cyclone Affected Areas Tour Roundup
  • మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
  • కోనసీమ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను పరామర్శ
  • జెడ్ క్యాటగిరీ భద్రత లేకుండా సాధారణ వాహనంలో ప్రజల వద్దకు సీఎం
  • ముంపునకు గురైన పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి నష్టపరిహారంపై హామీ
  • తెల్లవారుజాము నుంచే అధికారులతో సమీక్షలు, 25 వేల మందితో టెలీకాన్ఫరెన్స్
  • పర్యటన అనంతరం సచివాలయంలో మళ్లీ మంత్రులు, అధికారులతో సమీక్ష
మొంథా తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రభావిత జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఆయన పర్యటన సందర్భంగా తన భారీ భద్రతను సైతం పక్కనపెట్టి సాధారణ వాహనంలో ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

నిన్న రాత్రి 12 గంటలకు సచివాలయం నుంచి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి... నేడు ఉదయం 5 గంటల నుంచే తుపాను సహాయక చర్యలపై దృష్టిసారించారు.

5:00 AM: వివిధ వర్గాల నుంచి, ప్రసార మాధ్యమాల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు అధికారులను, ప్రభుత్వ విభాగాలను అలెర్ట్ చేస్తూ మొదలైన సీఎం చంద్రబాబు కార్యాచరణ.

9:00 AM: ఉదయం 9 గంటలకు తుపాను ఎఫెక్ట్, రాష్ట్ర వ్యాప్త పరిస్థితిపై సీఎంవో, ఆర్టీజీఎస్ అధికారులతో చర్చ.

10:00 AM: ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహణం... ఆయా ప్రాంతాల్లో గ్రామ స్థాయి పరిస్థితులపై ఆరా. తుపాను సమయంలో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించడానికి తీసుకున్న చర్యలపై అధికారులతో మాట్లాడిన సీఎం... నేటి ప్రణాళికపై అధికారులు, మంత్రులతో చర్చ. ఫీల్డ్ లో ఉండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారంటూ టెలీకాన్ఫరెన్స్ లో అధికారులు, ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అభినందన

11:00 AM: తుపాను బాధితులకు బియ్యం, నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించే విషయంపై సమీక్ష. బాధిత ప్రజలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశం.

12:30 PM: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్లిన సీఎం చంద్రబాబు. పల్నాడు, బాపట్ల, కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాల్లో తుపాను ప్రభావం పరిశీలన. చిలకలూరిపేట, పరుచూరు, చీరాల, బాపట్ల, నాగాయలంక, మచిలీపట్నం, కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవు వరకు ఏరియల్ విజిట్.

2:00 PM: దాదాపు గంటన్నర పాటు ఏరియల్ విజిట్ అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల హెలిపాడ్ వద్ద ల్యాండ్ అయిన చంద్రబాబు.

2:15 PM: జెడ్ క్యాటగిరీ స్థాయి భద్రత లేకుండా, బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం లేకుండా, సాధారణ వాహనంలో పూర్తి స్థాయి సెక్యూరిటీ లేకుండా ముఖ్యమంత్రి పర్యటన. ఓడరేవుల సమీపంలోని పునరావాస కేంద్రంలో దాదాపు అరగంట సేపు తుపాను బాధితులతో మాట్లాడి వారి సాధకబాధకాలు, అందుతున్న సౌకర్యాలను అడిగితెలుసుకున్న ముఖ్యమంత్రి.

తుపాను బాధిత ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.

అనంతరం అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి పిల్లలతో ముచ్చటించిన ముఖ్యమంత్రి

3:00 PM: అరగట్ల పాలెం, బెండమూరు లంకలో నీటి మునిగిన పొలాలను స్థానికులతో కలిసి పరిశీలించిన ముఖ్యమంత్రి. రైతులకు జరిగిన నష్టానికి పరిహారంపై హామీ. పొలంలోకి వెళ్లి అన్నదాతలతో చర్చించిన సీఎం

4:30 PM: క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం మళ్ళీ హెలికాఫ్టర్ లో తిరుగు ప్రయాణమైన సీఎం. తిరుగు ప్రయాణంలో కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన, అమలాపురం, అంబాజీ పేట, మండపేట, రాయవరం, ఏలూరు జిల్లా ముదినేపల్లి గ్రామాల్లో తుపాను ప్రభావం, పంట నష్టాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి.

5:30 PM: ఏరియల్ విజిట్ ముగించుకుని నేరుగా సచివాలయం సమీపంలోని హెలిపాడ్ వద్ద ల్యాండ్ అయిన సీఎం చంద్రబాబు.

6:00 PM: సచివాలయ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి మంత్రులు, అధికారులతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పంట నష్టం, బాధిత కుటుంబాలకు అందుతున్న ప్రభుత్వ సాయంపై సమీక్ష.

తన ఏరియల్ విజిట్ లో గమనించిన అంశాలు, బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందించాల్సి సాయంపై అధికారులతో చర్చ.

7:30 PM: రాత్రి పొద్దుపోయే వరకు సచివాలయంలో ఆర్టీజీ సెంటర్ లో సమీక్ష కొనసాగింపు.
Chandrababu Naidu
Cyclone Montha
Andhra Pradesh floods
Konaseema district
Cyclone relief
Aerial survey
Crop damage
Government assistance
Disaster management
CM review

More Telugu News