Indian Family: రెస్టారెంట్ లో ఫుడ్ ప్యాక్ చేసుకున్న ఇండియన్ ఫ్యామిలీ... సోషల్ మీడియాలో చర్చ

Indian Family Food Packing in Zurich Hotel Sparks Social Media Debate
  • జ్యూరిచ్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ప్యాక్ చేసిన భారత కుటుంబం
  • ఈ ఘటనపై సుమిత్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో వైరల్
  • భారతీయుల వల్లే ప్రపంచవ్యాప్తంగా చులకన భావం ఏర్పడుతోందన్న సుమిత్
  • ఇది కేవలం భారతీయులకే పరిమితం కాదంటూ నెటిజన్ల వాదన
  • ఇతర దేశాల వారు కూడా ఇలాగే చేస్తారంటూ పలువురి కామెంట్లు
  • ప్రయాణ మర్యాదలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ఓ భారత కుటుంబం ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అక్కడి ఓ హోటల్‌లో బస చేసిన ఈ కుటుంబం, బ్రేక్‌ఫాస్ట్ బఫే నుంచి ఆహారాన్ని ప్యాక్ చేసుకుని తీసుకెళ్లడం వివాదానికి దారితీసింది. ఇదే హోటల్‌లో బస చేస్తున్న సుమిత్ అనే భారతీయుడు ఈ ఘటనను ఫొటో తీసి ‘ఎక్స్’ లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, జ్యూరిచ్‌లోని ఓ హోటల్ బ్రేక్‌ఫాస్ట్ బఫే వద్ద "ఆహారాన్ని బయటకు తీసుకువెళ్లరాదు" అని స్పష్టంగా సూచించినప్పటికీ, ఓ భారత కుటుంబం ఆ నిబంధనను ఉల్లంఘించింది. భోజనం ముగించాక వారు తమతో తెచ్చుకున్న ఖాళీ డబ్బాలలో పండ్లు, పెరుగు, ఉడికించిన గుడ్లు వంటివాటిని నింపుకున్నారు.

ఈ విషయాన్ని గమనించిన సుమిత్, ఆ కుటుంబాన్ని విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. "ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ కుటుంబం స్విట్జర్లాండ్ పర్యటనకు లక్షలు ఖర్చు చేసి ఉంటుంది. అయినా ఇలా ప్రవర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మనల్ని ఎందుకు చులకనగా చూస్తారో వీళ్లు నిరూపించారు" అని తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది నెటిజన్లు సుమిత్ వాదనతో ఏకీభవిస్తూ, ఇలాంటి ప్రవర్తన దేశానికి అవమానకరమని కామెంట్లు చేశారు. అయితే, చాలామంది ఆ కుటుంబాన్ని వెనకేసుకొచ్చారు. బఫే నుంచి ఆహారాన్ని ప్యాక్ చేసుకోవడం కేవలం భారతీయులకే పరిమితం కాదని, చాలా దేశాల పర్యాటకులు ఇలాగే చేస్తారని వాదించారు.
Indian Family
Switzerland
Zurich
Hotel Buffet
Food Packing
Social Media
Travel Etiquette
Cultural Stereotypes
Indian Tourists
Sumit

More Telugu News