Azharuddin: అజారుద్దీన్‌కు మంత్రి పదవి... ఎల్లుండి ప్రమాణ స్వీకారం?

Azharuddin to get Minister Post Swearing in Ceremony Soon
  • మంత్రి వర్గ విస్తరణకు అధిష్ఠానం నుంచి అనుమతి!
  • ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ఇంకా ఆమోదం తెలపని గవర్నర్
  • అయినప్పటికీ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ ఆమోదం!
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించినట్టు తెలుస్తోంది. ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుందని, ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్ఠానం నుంచి అనుమతి లభించినట్లు సమాచారం.

తెలంగాణ మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. మరో ముగ్గురికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.

అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ, ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంల పేర్లను ఎంపిక చేసి, గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది. అయినప్పటికీ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏఐసీసీ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Azharuddin
Telangana cabinet expansion
Congress party
Telangana politics
Indian National Congress

More Telugu News