Amit Shah: బీహార్ ముఖ్యమంత్రి పదవి.. కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

Amit Shah Comments on Bihar Chief Minister Post
  • రాజకీయాల్లో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదన్న అమిత్ షా
  • నితీశ్ బీహార్ సీఎంగా, కేంద్రంలో మోదీ ప్రధానిగా ఉంటారన్న అమిత్ షా
  • మరోవైపు, తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన మహాఘట్‌బంధన్
బీహార్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదని ఆయన స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పారు.

బీహార్‌లోని దర్భంగాలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన తనయుడిని ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తే, సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ ప్రకటించింది. ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ నాయకత్వంలోనే బీహార్ ఎన్నికలకు వెళతామని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాజాగా, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అమిత్ షా తేల్చి చెప్పారు.
Amit Shah
Bihar
Nitish Kumar
Bihar Elections
Narendra Modi
RJD
Congress
Tejashwi Yadav
Darbhanga

More Telugu News