Ram Gopal Varma: 'శివ' కోసం కొన్ని కుట్రలు చేయవలసి వచ్చింది: వర్మ

Ram Gopal Varma Interview
  • నాగ్ కెరియర్ ను మలుపు తిప్పిన 'శివ'
  • వర్మ ను నిలబెట్టిన సినిమా 
  • సంచలన విజయాన్ని సాధించిన కంటెంట్ 
  • నవంబర్ 14న రీ రిలీజ్

రామ్ గోపాల్ వర్మ .. 'శివ' సినిమాతో తెలుగులో ఒక కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. ఆ సినిమా యూత్ పై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. 1989లో వచ్చిన ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. నాగార్జున కెరియర్ ను మలుపు తిప్పిన ఆ సినిమాను, నవంబర్ 14వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విశేషాలను గురించి, 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ పంచుకున్నారు. 

"చాలామంది లైఫ్ లో పైకి వచ్చాక, కెరియర్ మొదట్లో తమకి జరిగిన అవమానాలను గురించి చెప్పుకుంటూ ఉంటారు.. కానీ అది కరెక్ట్ కాదు. అప్పటికి ఎలాంటి గుర్తింపు లేని మనలను అవతలవాళ్లు ఎందుకు గౌరవించాలి? మనలను గుర్తించకపోవడం అవతలివారి తప్పు కాదు .. ఆ స్థాయికి చేరుకోకపోవడం మన వైపు నుంచి తప్పు అవుతుంది అని నమ్మేవాడిని నేను. 'శివ' ప్రాజెక్టును పట్టాలెక్కించే విషయంలోను ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. వాటిని నేను దాటుకుంటూ వెళ్లాను" అని అన్నారు. 

'శివ' సినిమా విషయంలో నాగార్జునగారు ఓకే అన్నప్పటికీ, నాగేశ్వరావుగారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవచ్చని అనిపించింది. ఆయనతో పాటు వెంకట్ గారిని ఒప్పించవలసిన అవసరం నాపై ఉంది. అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఆలోచన చేసి ఆ రూట్ లో ముందుకు వెళ్లాను. ముగ్గురికీ కూడా దగ్గరవుతూ నాపై నమ్మకం కలిగేలా చేసుకోగలిగాను. ఆ సమయంలో వారి వైపు నుంచి వేరే ప్రాజెక్టులు అడ్డుపడకుండా చూసుకోగలిగాను. అలా 'శివ' పట్టాలెక్కడానికి వేయి అబద్ధాలు ఆడవలసి వచ్చింది .. కొన్ని కుట్రలు చేయవలసి వచ్చింది" అని చెప్పారు. 

Ram Gopal Varma
Shiva movie
Nagarjuna
Akkineni Nageswara Rao
Telugu cinema
Suman TV interview
Shiva re-release
1989 Shiva film
Telugu film industry
Movie making secrets

More Telugu News