Sanae Takaichi: జపాన్ ప్రధాని చేతిలో బ్యాగు.. తయారీ కంపెనీకి వెల్లువెత్తిన ఆర్డర్లు

Sanae Takaichi bag boosts orders for Hamano Co
  • రూ.79 వేల విలువైన బ్యాగుతో కనిపించిన సొనై తకాయిచీ
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో.. బ్యాగుకు పెరిగిన డిమాండ్
  • ‘హమానో’ కంపెనీ 145 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరగని ఆర్డర్లు
జపాన్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సొనై తకాయిచీ తన అధికారిక నివాసంలోకి వెళుతున్న ఓ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో తకాయిచీ చేతిలో నలుపు రంగులో ఉన్న ఓ లెదర్ బ్యాగును తీసుకెళ్లడం కనిపిస్తోంది. దీంతో ఆ బ్యాగుపై జపాన్ వాసుల్లో ఆసక్తి పెరిగింది.

నెటిజన్లు ఆరా తీయగా.. సదరు బ్యాగును నాగానో కు చెందిన హమానో కంపెనీ తయారు చేసిందని తేలింది. పూర్తిగా లెదర్ తో చేసినప్పటికీ ఈ బ్యాగు బరువు కేవలం 700 గ్రాములు మాత్రమే. ‘గ్రేస్ డిలైట్ టోటె’ పేరుతో అమ్మకానికి పెట్టిన ఈ బ్యాగు ధర 895 అమెరికన్ డాలర్లు.. అంటే జపాన్ కరెన్సీలో 1,36,424 యెన్ లు.. భారత కరెన్సీలో రూ.79 వేలు.

ఈ వివరాలను యాడ్ చేయగానే ‘గ్రేస్ డిలైట్ టోటె’ బ్యాగుకు జపాన్ వ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. జపాన్ నలుమూలల నుంచి హమానో కంపెనీకి ఆర్డర్లు ముంచెత్తుతున్నాయి. కంపెనీ 145 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఆర్డర్లు అందుకుంటున్నట్లు హమానో కంపెనీ యాజమాన్యం తెలిపింది.
Sanae Takaichi
Japan Prime Minister
Hamano Company
Grace Delight Tote
Leather Bag
Nagano
Japan Economy
Viral Photo
Online Orders
Japanese Products

More Telugu News