Doctor suicide: అప్పు తీసుకుని ముఖం చాటేసిన స్నేహితులు.. కరీంనగర్ లో వైద్యుడి ఆత్మహత్య

Karimnagar Doctor Empati Srinivas Suicide Due to Friends Loan Betrayal
  • స్నేహితులకు అప్పిచ్చి మోసపోయానని మనోవేదన
  • ఇద్దరు మిత్రులకు రూ.1.78 కోట్లు అప్పిచ్చిన డాక్టర్ శ్రీనివాస్
  • శ్రీనివాస్ పేరుమీద బ్యాంకు నుంచి రూ.1.35 కోట్ల రుణం తీసుకున్న మరో ముగ్గురు ఫ్రెండ్స్
  • ఇంజెక్షన్లు తీసుకుని బలవన్మరణానికి పాల్పడిన వైద్యుడు
కరీంనగర్ లో స్నేహితులను నమ్మి అప్పిస్తే తిరిగివ్వకుండా ముఖం చాటేయడంతో యువ వైద్యుడు ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తను అప్పు ఇవ్వడమే కాకుండా తన పేరుతో బ్యాంకులో కూడా రుణం ఇప్పించాడా వైద్యుడు.. స్నేహితులు మోసం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై చివరకు తన ప్రాణం తీసుకున్నాడు. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ మంకమ్మతోటకు చెందిన వైద్యుడు ఎంపటి శ్రీనివాస్‌(43) నగర శివార్లలోని ఓ మెడికల్ కాలేజీలో ఎనస్తీషియా విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ వైద్యురాలు. వారికి ఒక కుమారుడు.

శ్రీనివాస్ తన స్నేహితులు ఇద్దరికి రూ.1.78 కోట్లు అప్పుగా ఇచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని సాయం కోరిన మరో ముగ్గురు స్నేహితులకు బ్యాంకులో తన పేరుమీద రూ.1.35 కోట్ల లోన్ ఇప్పించాడు. అప్పు తీసుకునేటపుడు అంతా బాగానే ఉంది కానీ తిరిగి చెల్లించే విషయంలో స్నేహితులు ముఖం చాటేశారు. మిత్రులు ఎంతకూ తన డబ్బు తిరిగివ్వకపోవడంతో శ్రీనివాస్ మనోవేదనకు గురయ్యాడు. ఇదే విషయమై తన వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశాడని శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ తెలిపారు.

ఈ ఆందోళనతో తన భర్త అనారోగ్యం పాలయ్యాడని, వారం రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాడని ఆమె చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున తాను నిద్రలేచేసరికి భర్త నేలపై పడిపోయి కనిపించారని విప్లవశ్రీ తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారని ఆమె పేర్కొన్నారు. తన భర్త మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Doctor suicide
Karimnagar
Loan fraud
Empati Srinivas
Financial problems
Medical college
Andhra Pradesh news
Telangana news
Suicide case
Friend betrayal

More Telugu News