Arjun Ashokan: ఓటీటీకి వచ్చేసిన మలయాళ మూవీ!

Thalavara Movie Update
  • మలయాళంలో రూపొందిన 'తలవర'  
  • ప్రధానమైన పాత్రలో అర్జున్ అశోకన్ 
  • ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో
  • అవమానం - ఆత్మాభిమానం చుట్టూ తిరిగే కథ   

మలయాళంలో గుర్తుపెట్టుకోదగిన నటులలో అర్జున్ అశోకన్ ఒకరు. అక్కడ ఆయనకంటూ అభిమాన వర్గం ఉంది. ఆయన సినిమాలను వదలకుండా చూసేవారున్నారు. అందుకు కారణం ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు .. వాటిలో ఆయన ఒదిగిపోయే తీరు అనే చెప్పాలి. అలాంటి అర్జున్ అశోకన్ రీసెంటుగా వచ్చిన సినిమానే 'తలవర'. అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 22వ తేదీన థియేటర్లకు వచ్చింది.

వసూళ్ల విషయం అలా ఉంచితే, కంటెంట్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. అర్జున్ అశోకన్ నటనకి ప్రశంసలు తెచ్చిపెట్టింది. సహజత్వంతో కూడిన ఎమోషన్స్ అక్కడి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. అభిరామి రాధాకృష్ణన్ .. దేవదర్శిని .. రేవతి శర్మ  .. అశ్వత్ లాల్ .. ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజునే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు ఆడియోను కూడా జోడించే అవకాశం ఉంది.

ఈ సినిమాలో కథానాయకుడు జ్యోతిష్ 'బొల్లి' వ్యాధితో ఇబ్బందిపడుతూ ఉంటాడు. అందువలన అతను అనేక రకాలుగా అవమానాలను ఎదుర్కుంటూ ఉంటాడు. అవమానాలు .. ఆత్మాభిమానం ఈ రెండింటి మధ్య అతను నలిగిపోతూ ఉంటాడు. కుటుంబం మొదలు సమాజం వరకూ తనకి ఎదురవుతున్న అనుభవాలు అతను బాధపడేలా చేస్తాయి. ఆ సమయంలోనే అతనికి సంధ్య తారసపడుతుంది. ఆమె పరిచయంతో ఆతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ.

Arjun Ashokan
Thalavar movie
Malayalam movies
OTT release
Akhil Anil Kumar
Abhirami Radhakrishnan
Bollu disease
Malayalam cinema

More Telugu News