Surya: రవితేజకు నేను ఫ్యాన్: హీరో సూర్య
- రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసిన సూర్య
- ఎనర్జీకి నిలువెత్తు రూపం మాస్ మహారాజా అని ప్రశంస
- రవితేజ కామెడీ టైమింగ్‌కు ప్రత్యేక శైలి ఉందని వ్యాఖ్య
- ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ జాతర
మాస్ మహారాజా రవితేజపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రశంసల వర్షం కురిపించారు. తాను రవితేజకు పెద్ద అభిమానినని, ఎనర్జీకి ఒక రూపం ఉంటే అది రవితేజనే అవుతారని కొనియాడారు. రవితేజ, శ్రీలీల జంటగా నూతన దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ‘మాస్ జాతర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రం ఈ నెల 31 నుంచి (సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్స్) విడుదల కానుంది.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. "రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. నా భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పేవారు. సామాన్యుడి పాత్రలను సైతం తెరపై కింగ్‌సైజ్‌లో చూపించగల నటుడు ఆయన. కామెడీ పండించడం ఎంతో కష్టం. కానీ, ఆ విషయంలో రవితేజ గారికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఇన్నేళ్లుగా ప్రేక్షకులను అలరించడం సాధారణ విషయం కాదు" అని అన్నారు.
"ఈ నెల 31న థియేటర్లలో రవితే‘జాతర’ జరగనుంది" అంటూ సినిమాపై అంచనాలు సూర్య పెంచారు.