Prashant Kishor: ఎస్ఐఆర్‌లో నా పేరును ఎందుకు తొలగించలేదు.. నా తప్పు ఉంటే అరెస్టు చేయండి: ప్రశాంత్ కిశోర్

Prashant Kishor Challenges Arrest Over Voter ID Controversy
  • రెండు రాష్ట్రాలలో ఓటరు ఐడీలు ఉన్నాయని, సమాధానం చెప్పాలని ఈసీ నోటీసులు
  • 2019 నుంచి తనకు ఖార్గహార్ నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నట్లు వెల్లడి
  • ఎస్ఐఆర్ అమలు చేయడం ద్వారా అందర్నీ ఇబ్బంది పెడుతున్నారన్న ప్రశాంత్ కిశోర్
తనకు రెండు రాష్ట్రాలలో ఓటరు గుర్తింపు కార్డులు లేవని, అది నిజమైతే, తన పేరును ఎస్ఐఆర్‌ (SIR)లో ఎందుకు తొలగించలేదని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. తాను తప్పు చేసి ఉంటే అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ప్రశాంత్ కిశోర్‌కు రెండు రాష్ట్రాలలో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. దీనిపై స్పందన తెలియజేయాలని ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

2019 నుంచి తాను బీహార్ లోని ఖార్గహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నానని, తాను కోల్‌కతాలో రెండేళ్లు ఉన్న సమయంలో అక్కడ ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. 2021 నుంచి తన ఓటరు గుర్తింపు కార్డు ఖార్గహార్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉందని స్పష్టం చేశారు.

తన పేరు మీద రెండు రాష్ట్రాల్లో ఓటరు కార్డు ఉన్నది నిజమే అయితే, ఎస్ఐఆర్ (SIR)లో తన పేరును ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. తన తప్పు ఉంటే అరెస్టు చేసుకోవాలని సవాల్ చేశారు. ఎస్ఐఆర్‌ను అమలు చేయడం ద్వారా అందరినీ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఈసీఐ జారీ చేసిన నోటీసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Prashant Kishor
Jan Suraj Party
Voter ID
Election Commission of India
SIR
Khargahar
Kolkata
Voter List

More Telugu News