South Central Railway: శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపేజీపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

South Central Railway Key Decision on Satavahana Express Stop
  • శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగామలో స్టాపేజీ
  • అక్టోబర్ 30 నుంచి ప్రయోగాత్మకంగా ఆగుతుందన్న దక్షిణ మధ్య రైల్వే శాఖ
  • ఒక నిమిషం పాటు ఆగుతుందని వెల్లడి
దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కేంద్రంలో శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాప్ సౌకర్యం కల్పించారు. విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై జనగామ రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది.

ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 30వ తేదీ నుంచి శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జనగామ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఆగుతుందని ప్రకటించింది. విజయవాడ-సికింద్రాబాద్ రైలు ఉదయం 10:14 - 10:15 గంటల మధ్య ఒక నిమిషం పాటు, సికింద్రాబాద్ - విజయవాడ రైలు సాయంత్రం 5:19 - 5:20 గంటల మధ్య జనగామ రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
South Central Railway
Satavahana Express
Jangaon
Secunderabad
Vijayawada
Telangana
Indian Railways
Railway Stop

More Telugu News