HYDRA Hyderabad: హైదరాబాద్‌లో కబ్జా నుంచి 1.27 ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా

HYDRA Saves 127 Acres from Encroachment in Hyderabad
  • ప్రజావాణిలో ఫిర్యాదుల ఆధారంగా ఆక్రమణల తొలగింపు
  • సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన
  • హస్తినాపురం నార్త్ ఎక్స్‌టెన్షన్ కాలనీలో 1.27 ఎకరాల పార్కును కాపాడిన హైడ్రా
  • చందానగర్ సర్కిల్ పరిధిలో 700 గజాల స్థలానికి ఫెన్సింగ్
హైదరాబాద్ నగరంలో హైడ్రా పలు ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల మేరకు, సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలిన అనంతరం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్ మండలం, కర్మన్‌ఘాట్‌లోని హస్తినాపురం నార్త్ ఎక్స్‌టెన్షన్ కాలనీలో 1.27 ఎకరాల పార్కును కబ్జా చేశారంటూ స్థానిక అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. లే అవుట్‌లో పార్కు స్థలంగా చూపించి, ఆ తర్వాత ప్లాట్లుగా విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారిణ జరిపి ఆక్రమణలను తొలగించారు.

చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఆక్రమణకు గురికాకుండా కాపాడినట్లు తెలియజేస్తూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. అదేవిధంగా, శేరిలింగంపల్లి జోన్, చందానగర్ సర్కిల్ పరిధిలోని గంగారాం కాలనీలో సుభాష్ నగర్ పేరుతో 1974లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ లే అవుట్ వేసింది. ఇందులో 700 గజాల స్థలాన్ని ప్రజావసరాల కోసం కేటాయించారు.

పేద ప్రజల కోసం ఉద్దేశించిన లే అవుట్‌లో కొందరు బడాబాబులు ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాటుగా మార్చారు. ఈ ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, హైడ్రా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
HYDRA Hyderabad
Hyderabad HYDRA
HYDRA Telangana
Telangana news
Hyderabad land encroachment

More Telugu News