Cyclone Montha: తుపాన్ ఎఫెక్ట్ తో కాకినాడ జిల్లాలో స్కూళ్లు, కాలేజీల బంద్.. 31 వరకు సెలవులు
- కాకినాడ వద్ద తీరం దాటనున్న మొంథా తుపాన్
- తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు
- తుపాన్ ప్రభావంతో కాకినాడలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ ను మొంథా తుపాన్ వణికిస్తోంది. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మొంథా తుపాన్ గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు 360 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాకినాడ దగ్గర ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీవ్ర తుపాన్ గా మారి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఈ నెల 31 వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను మూసేయాలని ఆదేశించారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు, రేపు విద్యాసంస్థలకు అధికారులు సెలువులు ప్రకటించారు. వర్షాల పరిస్థితిని గమనించి సెలవులు పొడిగించాలా లేదా అని నిర్ణయం తీసుకుంటారు.