గుడికి వెళ్లి తిరిగొస్తుంటే రోడ్డుపై దొరికిన డబ్బు సంచి.. లోపల 17.5 లక్షలు
- సంచీ నిండా రూ.500 నోట్లకట్టలే
- తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన చెన్నై మహిళ
- మహిళను అభినందించిన పోలీసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై సిమ్మక్కల్ ప్రాంతానికి చెందిన సెల్వమాలిని అనే మహిళ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సెల్వమాలిని ఆలయం నుంచి ఇంటికి వెళుతుండగా రోడ్డుపై ఓ సంచీ కనిపించింది. రోడ్డు మధ్యలో ఉన్న ఆ సంచీని పక్కన పడేయాలనే ఉద్దేశంతో సెల్వమాలిని దగ్గరకు వెళ్లగా.. అందులో నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో సమీపంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆ సంచీని తీసుకెళ్లి అప్పగించింది. కాగా, ఆ నోట్ల కట్టల బ్యాగు ఎవరిది.. అక్కడ ఎందుకు ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.