Ravinder Singh Negi: యమునా శుభ్రతపై రీల్.. కాలుజారి నదిలో పడ్డ బీజేపీ ఎమ్మెల్యే!

Ravinder Singh Negi falls into Yamuna River during video shoot
  • ఢిల్లీ పత్పర్‌గంజ్ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగికి తప్పిన ప్రమాదం
  • ఎమ్మెల్యే వీడియోను షేర్ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ
  • ఛఠ్ పూజ వేళ యమునా కాలుష్యంపై బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర మాటల యుద్ధం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వీడియో
  • గతంలో యమునా నీళ్లు తాగాలంటూ బీజేపీకి ఆప్ నేత విసిరిన సవాల్
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రక్షాళనపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో యమునా నది శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఓ వీడియో (రీల్) చిత్రీకరిస్తుండగా, పత్పర్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి అదుపుతప్పి నదిలో పడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం మరింత పెరిగింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సంజీవ్ ఝా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. బీజేపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ,"బహుశా అబద్ధాలు, ప్రచార రాజకీయాలతో విసిగిపోయిన యమునా మాత.. స్వయంగా వారిని తన వద్దకు పిలిపించుకున్నట్టుంది" అని చురక అంటించారు.

19 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో, ఎమ్మెల్యే నేగి రెండు బాటిళ్లను చేతిలో పట్టుకుని యమునా నది ఒడ్డున మోకాళ్లపై కూర్చుని ఉంటారు. అక్కడి నుంచి లేవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూర్తిగా తడిసిపోయిన నేగి, అక్కడున్న ఓ వెదురు కర్రను పట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపించింది.

ప్రస్తుతం ఢిల్లీలో ఛఠ్ పూజ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో యమునా నది కాలుష్యంపై ఇరు పార్టీల మధ్య తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యమునా నదిని శుభ్రం చేశామని బీజేపీ చెబుతుండగా, అది పూర్తిగా కలుషితమైందని ఆప్ విమర్శిస్తోంది. గత వారాంతంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఆప్ ఢిల్లీ విభాగం చీఫ్ సౌరభ్ భరద్వాజ్, మురికి నీటితో నింపిన ఓ బాటిల్‌తో బీజేపీ నేత రేఖా గుప్తా ఇంటికి వెళ్లి, యమున శుభ్రంగా ఉందని నిరూపించేందుకు ఆ నీటిని తాగాలని సవాల్ విసిరారు.
Ravinder Singh Negi
Yamuna River
Delhi
BJP
Aam Aadmi Party
AAP
Yamuna River pollution
Chhath Puja
politics
Sanjeev Jha

More Telugu News