Harish Rao: బావ సత్యనారాయణ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. హరీశ్‌కు ఫోన్ చేసిన బీఆర్ఎస్ అధినేత

KCR Condoles Demise of Harish Raos Father Satyanarayana
  • మాజీ మంత్రి హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం
  • ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత
  • హరీశ్‌రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాద ఛాయలు
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ వేకువజామున కన్నుమూశారు. ఈ వార్తతో హరీశ్‌రావు కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.

సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే కేసీఆర్... హరీశ్‌రావుకు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. తన బావ అయిన సత్యనారాయణ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Harish Rao
Harish Rao father
Tanneeru Satyanarayana
KCR
BRS Party
Siddipet MLA
Telangana news
Condolences
Telangana politics

More Telugu News