నిర్మల్ 'లక్కీ లేడీ'.. డ్రాలో రెండు మద్యం దుకాణాల కైవసం
- నిర్మల్ జిల్లాలో ఓ మహిళకు జాక్‌పాట్
- లక్కీ డ్రాలో రెండు వైన్ షాపుల కైవసం
- లక్ష్మణచాంద, పొనకల్ దుకాణాలు దక్కించుకున్న హారిక
వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇటీవల మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గుర్రాల హారిక అనే మహిళ లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లోని రెండు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు.
ఈ లక్కీ డ్రాలో హారిక పేరు రెండుసార్లు విజేతగా నిలిచింది. ఆమె దరఖాస్తు చేసిన రెండు దుకాణాలు ఆమెకే దక్కాయి. వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేనప్పటికీ, అదృష్టం కలిసిరావడంతో ఆమె ఒకేసారి రెండు దుకాణాలకు యజమాని అయ్యారు. ఊహించని విధంగా రెండు షాపులు రావడంతో హారిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం తెలియగానే బంధువులు, స్థానికులు ఆమెకు అభినందనలు తెలిపారు.