Neom Stadium: ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియం నిర్మాణానికి సౌదీ అరేబియా సన్నాహాలు
- 2034 ఫిఫా ప్రపంచ కప్ కోసం భూమికి 350 మీటర్ల ఎత్తులో నిర్మాణం
- ఫ్యూచర్ సిటీ 'ది లైన్'లో భాగంగా స్కై స్టేడియం నిర్మణ
- 2027లో ప్రారంభించి 2032లో పూర్తి చేయాలని ప్లాన్
ప్రపంచంలోనే మొట్టమొదటి 'స్కై స్టేడియం' నిర్మాణానికి సౌదీ అరేబియా సన్నాహాలు చేస్తోంది. సౌదీ అరేబియాలోని ఫ్యూచర్ సిటీ 'ది లైన్' నగరంలో నియోమ్ స్టేడియం పేరుతో ఈ 'స్కై స్టేడియాన్ని' నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. 2034 ఫిఫా ప్రపంచ కప్ కోసం దీనిని భూమికి 350 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు.
2032 నాటికి ఈ స్టేడియం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. 'ది లైన్'ను వారు తమ భవిష్యత్తు నగరంగా అభివర్ణిస్తున్నారు. ఈ 'స్కై స్టేడియం' 46,000 మంది ప్రేక్షకులకు ఆతిథ్యం ఇవ్వగలదు. 2034 ఫిఫా ప్రపంచ కప్‌ను సౌదీ అరేబియా నిర్వహిస్తోన్న నేపథ్యంలో ఈ స్టేడియాన్ని పర్యావరణ హితంగా నిర్మించనున్నారు.
పూర్తిగా పునరుత్పాదక శక్తితో పనిచేసేలా దీని డిజైన్ రూపొదించారు. అంతేకాకుండా, ఇందులో హైస్పీడ్ ఎలివేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేడియం నిర్మాణం 2027లో ప్రారంభించి, 2032 నాటికి పూర్తి చేయాలని సౌదీ అరేబియా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఈ స్టేడియంకు సంబంధించిన ఊహాచిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.