Nayanatara: మరోసారి బాలయ్య జోడీగా నయనతార?

Nayanathara Special
  • బాలయ్యతో గోపీచంద్ మలినేని సినిమా 
  • గతంలో హిట్ కొట్టిన 'వీరసింహ రెడ్డి'
  • నయనతారకి కథ వినిపించినట్టు టాక్ 
  • ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం   

నయనతారకి తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఒక వైపున సీనియర్ హీరోల సరసన చేస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. నయనతార ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు దాటిపోయింది. అయినా ఆమెకి గల క్రేజ్.. మార్కెట్ తగ్గకపోగా పెరుగుతూ ఉండటం విశేషం. ఇప్పుడు కూడా ఆమె పెద్ద బ్యానర్లలో .. భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. 

తెలుగులో ఆమె చిరంజీవి సరసన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో నయనతార మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక టాక్ షికారు చేస్తోంది. బాలకృష్ణతో 'వీర సింహారెడ్డి' చేసిన గోపీచంద్ మలినేని, ఆయనతో ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ సినిమాకి సంబంధించిన కథను, చిరంజీవి సినిమా సెట్లోనే గోపీచంద్  మలినేని ఆమెకి వినిపించాడని టాక్. కథ నచ్చడంతో నయనతార ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. అదే నిజమైతే బాలకృష్ణ సరసన ఆమెకి ఇది నాలుగో సినిమా అవుతుంది. గతంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన  సింహా .. శ్రీరామరాజ్యం .. జై సింహా విజయాలను సాధించిన సంగతి తెలిసిందే.

Nayanatara
Nayanatara movies
Balakrishna
Balakrishna movies
Gopichand Malineni
Veera Simha Reddy
Telugu cinema
Simha
Sri Rama Rajyam
Jai Simha

More Telugu News