Shubha: ఆ సీనియర్ హీరోయిన్ డిప్రెషన్ కి అదే కారణమట!

Nandam  Harishchandra Rao Interview
  • వేదాంతం రాఘవయ్య కూతురే శుభ
  • బాలీవుడ్ హీరోయిన్ రేఖకి కజిన్ సిస్టర్
  • గైడెన్స్ లేని కారణంగా దెబ్బతిన్న కెరియర్ 
  • ఒంటరిగా మిగిలిపోయిన వైనం

1970 - 80లలో వెండితెరపై అందంగా మెరిసిన కథానాయికలలో 'శుభ' ఒకరు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఆమె చాలా సినిమాలలో నటించారు. అలాంటి శుభ కెరియర్ గురించి తాజాగా 'ట్రీ మీడియా'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ప్రస్తావించారు. "బాలీవుడ్ హీరోయిన్ రేఖ తల్లి పుష్పవల్లి .. సూర్యప్రభ అక్కా చెల్లెళ్లు. సూర్యప్రభను దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు వివాహం చేసుకున్నారు. వారి సంతానమే శుభ" అని చెప్పారు. 

" వేదాంతం రాఘవయ్య గారు తన కూతురును నృత్య కళాకారిణిగా చూడాలని అనుకున్నారు. కానీ సూర్యప్రభగారు తన కూతురును రేఖ మాదిరిగా సినిమాల్లోకి వెళ్లాలని కోరుకున్నారు. తండ్రి మరణించిన తరువాత శుభగారు సినిమాల దిశగానే వెళ్లారు. సినిమాలలో ఒకస్థాయికి చేరుకున్న తరువాత వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఈ లోగా తల్లి కూడా చనిపోవడంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది" అని చెప్పారు. 

" తల్లి కూడా చనిపోవడంతో శుభగారు ఒంటరిగా మిగిలిపోయారు. ఎలాంటి సినిమాలు .. ఎలాంటి పాత్రలు ఒప్పుకోవాలి అనే విషయంలో ఆమెకి సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేకపోవడంతో, ఆమె వచ్చిన అవకాశాలను ఒప్పుకుంటూ వెళ్లిపోయారు. దాంతో ఆమెకంటూ ఒక ఇమేజ్ లేకుండా పోయింది. ఇతర భాషల్లో ఆమె చేసిన సినిమాలను తెలుగులో చేస్తూ ఆమెకి అవకాశాలు ఇచ్చేవారు కాదు. దాంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. మద్యానికి అలవాటు పడటం .. రేసులకు వెళ్లడం చేశారు. అలా ఆర్థికంగాను నష్టపోయారు" అని చెప్పారు.

Shubha
Shubha actress
Telugu actress
Tamil actress
Nandam Harishchandra Rao
Vedantam Raghavayya
Surya Prabha
Pushpavalli
depression
Tollywood

More Telugu News