Aishwarya Rai: సల్మాన్‌తో బ్రేకప్ తర్వాత ఐశ్వర్య ఎందుకు మౌనంగా ఉంది?: ప్రముఖ డైరెక్టర్ ప్రహ్లాద్ కక్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prahlad Kakkar on Why Aishwarya Rai Remained Silent After Salman Breakup
  • ఐశ్వర్య చాలా ప్రైవేట్ వ్యక్తి అన్న ప్రహ్లాద్ కక్కర్
  • మౌనంగా ఉండటమే తన గౌరవం, బలమని ఆమె భావించిందని వ్యాఖ్య
  • మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆమె స్పందించలేదని కక్కర్ వెల్లడి
బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బంధం, బ్రేకప్ గురించి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. 2002లో వీరిద్దరూ విడిపోయిన తర్వాత సల్మాన్‌పై ఐశ్వర్య పలు ఆరోపణలు చేసినా, ఆ తర్వాత పూర్తిగా మౌనం వహించారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఆమె మౌనం వెనుక గల కారణాన్ని ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ ప్రహ్లాద్ కక్కర్ తాజాగా వెల్లడించారు. ఐశ్వర్య వ్యక్తిత్వాన్ని వివరిస్తూ, సల్మాన్‌ను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఐశ్వర్య చాలా ప్రైవేట్ వ్యక్తి. అందరి ముందు సులభంగా ఓపెన్ అవ్వరు. ఆమెకు చాలా తక్కువ మంది సన్నిహితులు ఉంటారు, వారిని పూర్తిగా నమ్మితేనే తన మనసులోని మాటను స్వేచ్ఛగా పంచుకుంటారు. మిగతా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు" అని తెలిపారు. మీడియాకు అందని వారి గురించి తరచూ తప్పుడు ప్రచారం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రహ్లాద్ కక్కర్ ఈ విషయాలను పంచుకున్నారు. 

సల్మాన్‌తో విడిపోయిన తర్వాత ఐశ్వర్య ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదనే అంశంపై కక్కర్ స్పందిస్తూ, "మౌనంగా ఉండటమే తన గౌరవం అని ఐశ్వర్య భావించారు. తన మౌనమే తన బలమని ఆమె చాలా తొందరగా గ్రహించారు. మీడియా ఆమెను రెచ్చగొట్టి, విమర్శించి, ఏదో ఒకటి మాట్లాడించాలని ఎంత ప్రయత్నించినా ఆమె లొంగలేదు. 'మీకు కావాల్సింది నేను ఇవ్వను' అన్నట్లుగా నిశ్శబ్దంగానే ఉండిపోయారు. అదే ఆమె గొప్పతనం" అని వివరించారు.

ఇదే సమయంలో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ.. "సల్మాన్ ప్రవర్తన చాలా కష్టంగా ఉండేది. అతనికి చాలా సమస్యలు ఉండేవి" అని కక్కర్ వ్యాఖ్యానించారు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా సెట్స్‌లో ప్రేమలో పడిన సల్మాన్, ఐశ్వర్య సుమారు మూడేళ్ల పాటు డేటింగ్ చేసి 2002లో విడిపోయారు. ఆ సమయంలో సల్మాన్ తనను శారీరకంగా వేధించాడంటూ ఐశ్వర్య గతంలో పలు ఇంటర్వ్యూలలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రహ్లాద్ కక్కర్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఈ పాత వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
Aishwarya Rai
Salman Khan
Prahlad Kakkar
Bollywood breakup
Aishwarya Salman relationship
Hum Dil De Chuke Sanam
Bollywood news
celebrity gossip
Aishwarya Rai interview
Salman Khan controversy

More Telugu News