KTR: నాడు రాహుల్ గాంధీ ప్రయాణించిన ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్!

KTR Rides in Auto Previously Used by Rahul Gandhi
  • మస్రత్ అలీ అనే వ్యక్తి ఆటోలో తెలంగాణ భవన్ వచ్చిన కేటీఆర్
  • అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఈయన ఆటోనే ఎక్కారని గుర్తు చేసిన కేటీఆర్
  • ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. తెలంగాణలోని ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి, వారికి మద్దతుగా మస్రత్ అలీ అనే వ్యక్తి ఆటోలో కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ఆరు లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు.

గతంలో మస్రత్ అలీ ఆటోలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించారని ఆయన గుర్తు చేశారు. నాడు ఇదే ఆటోలో ప్రయాణించిన రాహుల్ గాంధీ, ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చారని విమర్శించారు. నిన్న రాహుల్, నేడు నేను ప్రయాణించిన ఈ మస్రత్ అలీ తనకున్న రెండు ఆటోలను అమ్మి ప్రస్తుతం కిరాయి ఆటో నడుపుతున్నాడని ఆయన తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న 161 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటోలో ప్రయాణించిన సమయంలో మస్రత్ అలీతో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ ఆటోలో ఉన్న సమయంలో పలువురు సెల్ఫీ దిగేందుకు ఆసక్తి కనబరిచారు.
KTR
KTR auto ride
Telangana Bhavan
Masrat Ali
Rahul Gandhi
Telangana auto drivers

More Telugu News