ఓటీటీలో ఎక్కువమంది చూస్తున్న హారర్ థ్రిల్లర్!
- మలయాళ సినిమాగా 'సుమతి వలవు'
- ప్రధానమైన పాత్రలో అర్జున్ అశోకన్
- దెయ్యం నేపథ్యంలో సాగే కథ
- ఓటీటీ వైపు నుంచి భారీ రెస్పాన్స్
విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మాళవిక మనోజ్ ..గోకుల్ సురేశ్ .. బాలు వర్గీస్ .. సైజూ కురుప్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 1వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా, సెప్టెంబర్ 26వ తేదీనుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అడవిని ఆనుకుని ఉన్న ఒక విలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథ ఆసక్తికరంగా కొనసాగుతుంది.
చాలా కాలం క్రితం ఒక రోడ్డు మలుపులో గర్భవతి అయిన సుమతి అనే యువతి చంపబడుతుంది. అప్పటి నుంచి ఆమె దెయ్యమై అక్కడే తిరుగుతూ ఉందనీ, ఆ దారిన వెళుతున్న ఎంతోమందిని బలి తీసుకుందని గ్రామస్తులు నమ్ముతుంటారు. సుమతి ఎవరు? ఆమె ఎలా చంపబడింది? అనేది మిగతా కథ. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. అందువల్లనే ఈ కంటెంట్ పట్ల ఎక్కువ మంది ఆసక్తిని చూపుతున్నారని చెప్పచ్చు.