Ajay: ఆ సినిమా నుంచి డబ్బే డబ్బు: నటుడు అజయ్!

Ajay Interview
  • సినిమాలంటే చాలా ఇష్టమన్న అజయ్ 
  • విలన్ వేషాలు పేరు తెచ్చాయని వెల్లడి 
  • కెరియర్ ను మలుపు తిప్పిన 'విక్రమార్కుడు'
  • పారితోషం గురించి పట్టించుకోలేదని వివరణ 
  •    

 విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా అజయ్ కి మంచి గుర్తింపు ఉంది. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి కొత్త ఆర్టిస్టులు వస్తున్నప్పటికీ, తన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తూనే ఉన్నారు. తాజాగా 'హిట్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ఆయన ప్రస్తావించారు. " చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే నాకు నటనపై ఆసక్తిని కలిగించింది .. నటన వైపుకు రావడానికి కారణమైంది" అని అన్నారు. 

'ఖుషి' దగ్గర నుంచి 'విక్రమార్కుడు' వరకూ నేను చాలా పెద్ద సినిమాలు చేశాను. అయితే అవి చిన్న చిన్న రోల్స్ కావడం వలన జనాలు ఎక్కువగా గుర్తుపెట్టుకోలేదు. ఆ సమయంలో ఒక నటుడిగా ఎటువైపు వెళ్లాలనే విషయంలో నేను కాస్త అయోమయానికి గురయ్యాను. 'విక్రమార్కుడు' సినిమాలో మంచి రోల్ పడటంతో నాపై నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. పెళ్లి తరువాత నాకు 'విక్రమార్కుడు'లో అవకాశం రావడం వలన, అది ఆమె అదృష్టంగానే నేను భావిస్తూ ఉంటాను" అని చెప్పారు.

" ఇండస్ట్రీ మనకి ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇస్తుంది. ఇది నేను నా అనుభవంతో చెబుతున్నాను. నేను తక్కువ అడిగితే . ఇంకాస్త ఎక్కువ అడగొచ్చు అన్నవాళ్లు ఉన్నారు .. ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పిన వాళ్లు ఉన్నారు. నాకు పాత్ర నచ్చితే చాలా తక్కువకి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఏ రోజునా నేను పారితోషికాన్ని గురించి పట్టించుకున్నది లేదు. 'విక్రమార్కుడు' నుంచి నేను హీరో అయ్యేవరకూ మధ్యలో ఉన్న ఫేజ్ లో నేను పారితోషికాన్ని గట్టిగానే తీసుకున్నాను. ఆ సమయంలో నేను అందుకున్నది పెద్ద అమౌంట్ అనే చెప్పాలి" అని అన్నారు. 

Ajay
Ajay actor
Telugu actor Ajay
Vikramarkudu movie
Khushi movie
Telugu cinema
Tollywood
Telugu films
character artist
villain roles

More Telugu News