భారత్, అమెరికా బంధంపై ఆ దేశ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- పాకిస్థాన్ తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు వెల్లడి
- అందుకోసం భారత్ తో బంధాన్ని బలిపెట్టలేమని వ్యాఖ్య
- భారత్, చైనా బంధాన్ని గుర్తుచేసిన మార్కో రూబియో
పాక్, అమెరికా బంధం భారత్ తో అగ్రరాజ్యం సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన వివరించారు. ఏ దేశ విదేశాంగ విధానంలోనైనా ఇది సహజమేనని చెప్పారు. పాకిస్థాన్ ను భారత్ దూరంపెట్టిందని అమెరికా కూడా పాక్ కు దూరంగా ఉండాలని కోరుకోవడం సబబు కాదన్నారు. ఆ మాటకొస్తే అమెరికా దూరం పెట్టిన చైనాకు ఇటీవల భారత్ దగ్గరవుతోందని రూబియో గుర్తుచేశారు. భారతీయులు పరిణతి కలిగిన వారని, పాక్ తో అమెరికా బంధాన్ని అర్థం చేసుకుంటారని రూబియో వ్యాఖ్యానించారు.