Rohit Sharma: రోహిత్ శర్మ ఇంకా బరువు తగ్గుతాడు... అప్పుడు చూడండి: అభిషేక్ నాయర్

Rohit Sharma will lose more weight says Abhishek Nayar
  • అంతర్జాతీయ కెరీర్‌ను పొడిగించుకోవడంపై దృష్టి పెట్టిన రోహిత్ శర్మ
  • 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా కఠిన కసరత్తులు
  • ఇప్పటికే 11 కిలోల బరువు తగ్గి సరికొత్త లుక్‌లో హిట్‌మ్యాన్
  • ఇష్టమైన వడాపావ్ తినడం మానేసి జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న వైనం
  • ఇంకా బరువు తగ్గే అవకాశం ఉందని వెల్లడించిన కోచ్ అభిషేక్ నాయర్
  • ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపిక
భారత అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒకడైన రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌ను మరింత కాలం కొనసాగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన హిట్‌మ్యాన్, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అతడు తన జీవనశైలిలో కీలక మార్పులు చేసుకున్నాడు. ఇప్పటికే 11 కిలోల బరువు తగ్గి సరికొత్త లుక్‌లోకి మారిన రోహిత్, భవిష్యత్తులో మరింత స్లిమ్ గా, ఫిట్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి.

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ శర్మకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చిన భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. "మూడు నెలల కఠోర శ్రమ, ఇష్టమైన ఆహారానికి దూరం, తీవ్రమైన శిక్షణ.. త్వరలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో మనం చూసేసరికి రోహిత్ మరికొన్ని కిలోలు తగ్గి కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని వ్యాఖ్యానించాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శతకం సాధించిన సందర్భంగా అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

గతంలో కూడా రోహిత్ ఫిట్‌నెస్‌పై మాట్లాడిన అభిషేక్ నాయర్.. తనకు అత్యంత ఇష్టమైన 'వడాపావ్' తినడం కూడా మానేసి, జిమ్‌లో ఒక బాడీబిల్డర్‌లా కసరత్తులు చేస్తున్నాడని తెలిపాడు. ఈ కఠోర శ్రమ ఫలితాలు ఆస్ట్రేలియా పర్యటనలో స్పష్టంగా కనిపించాయి. రోహిత్ తన స్లిమ్ లుక్‌తో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు.

తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు, ఈ విజయంతో క్లీన్‌స్వీప్ ముప్పు నుంచి తప్పించుకుంది.
Rohit Sharma
Indian Cricket
Fitness
Abhishek Nayar
2027 World Cup
Weight Loss
Australia Series
Virat Kohli
Shubman Gill
Cricket

More Telugu News