Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

Chiranjeevi Meets Telugu Film Journalists Association Members
  • మెగాస్టార్ చిరంజీవితో టీఎఫ్‌జేఏ ప్రతినిధులు భేటీ
  • అసోసియేషన్ కార్యక్రమాలను చిరంజీవికి వివరించిన ప్రతినిధులు
  • ఫిల్మ్ జర్నలిస్ట్ ల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానన్న చిరంజీవి
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) నూతనంగా ఎన్నికైన సభ్యులు నిన్న మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు సంస్థ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి చిరంజీవికి వివరించారు.

ప్రధానంగా సినీ జర్నలిస్టుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి పథకాలు అమలులో ఉన్నాయని, ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు తక్షణ సహాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని టీఎఫ్‌జేఏ సభ్యులు తెలిపారు. అలాగే భవిష్యత్తులో జర్నలిస్టుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా వారి కార్యక్రమాల గురించి తెలుసుకున్న చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులను అభినందిస్తూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం తనవంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేందర్ కుమార్ నాయుడు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను టీఎఫ్‌జేఏ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేసింది. 
Chiranjeevi
Telugu Film Journalists Association
TFJA
YJ Rambabu
Prasadam Raghu
Surender Kumar Naidu
Film Journalists Welfare
Telugu Cinema
Movie Journalists
Health Insurance

More Telugu News