Temporary Billionaire: రాత్రికి రాత్రే వేల కోట్లకు అధిపతిగా మారిన మధ్యప్రదేశ్ వాసి.. నిమిషాల్లోనే అంతా మాయం

Overnight Fortune Vanishes for Vinod Dongle in Stock Market Glitch
  • స్కూలు యజమాని డీమ్యాట్ ఖాతాలో 2,817 కోట్ల సంపద
  • తన తలరాత మారిపోయిందని సంబరపడ్డ వినోద్ డోంగ్లే
  • ప్రపంచంలోని అన్ని లాటరీలు ఒకేసారి గెల్చానని భావించినట్లు వెల్లడి
మధ్యప్రదేశ్ కు చెందిన నోటరీ, ప్రైవేటు స్కూలు యజమాని వినోద్ డోంగ్లే తలరాత రాత్రికి రాత్రే మారిపోయింది. ఆయన డీమ్యాట్ ఖాతాలోని ఓ కంపెనీ షేర్ల విలువ కోట్లకు పెరిగిపోయింది. మొత్తంగా వెయ్యికి పైగా షేర్లు ఉండడంతో ఆయన సంపద ఏకంగా రూ.2,817 కోట్లకు చేరినట్లు చూపించింది. దీంతో తన తలరాత మారిపోయిందని, ప్రపంచంలోని లాటరీలన్నీ ఒకేసారి గెల్చానని భావించినట్లు డోంగ్లే చెప్పారు. అయితే, ఈ ఆనందం కాసేపటికే ఆవిరైపోయింది.

అప్పటి వరకు ఒక్కో షేరు రూ.2.14 కోట్లు చొప్పున 1,312 షేర్ల విలువ రూ.2,817 కోట్లుగా చూపించగా.. కాసేపటికే ఆ అంకెలన్నీ మాయమై పాత విలువనే చూపించాయి. ఒక్కో షేరు 63 పైసల చొప్పున రూ.826.56 పైసలుగా చూపించింది. హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో వినోద్ డోంగ్లేకు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. కాసేపే అయినా అంకెల్లో తను బిలియనీర్ ను అయ్యానని వినోద్ డోంగ్లే సంతోషం వ్యక్తం చేశారు.
Temporary Billionaire
Vinod Dongle
Madhya Pradesh
Harsil Agro Limited
Share Market
Demat Account
Stock Value
Billionaire
Share Price
Stock Market India

More Telugu News